![]() |
![]() |

హౌస్ లోని కంటెస్టెంట్స్ కి కడుపు మంట రుచి చూపిస్తోన్నాడు బిగ్ బాస్. మొన్న ఇచ్చిన టాస్క్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వని కారణంగా నిన్న మండిపడ్డ బిగ్ బాస్ ఫుడ్ అంతా దొంగలను పంపించి లాగేసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఫుడ్ కావాలంటే టాస్క్ లు ఆడి గెలుచుకోవాలి అని చెప్పాడు బిగ్ బాస్. ఇక కంటెస్టెంట్స్ ఆకలికి తట్టుకోలేక ఒక్కొక్కరు ఒక్కోలా బాధపడుతూ ఉన్నారు. "కడుపులో రయ్ రయ్ అని ఎలుకలు పరుగెడుతున్నాయి అని" వసంతి చెప్పింది. ఆ తర్వాత "మనకు కావాల్సిందే, We Deserving This" అంటు బాధపడింది శ్రీసత్య. ఒకవైపు రేవంత్ 'సపాటు ఎటూ లేదు పాట అయిన పాడు బ్రదర్' అని పాడుతుండగా, శ్రీహాన్ కో సింగర్ గా పాడి కాసేపు ఆకలిని కామెడీ గా చూపారు. ఇక సూర్య అయితే కిచెన్ లో ఉన్న ఖాళీ డబ్బాలలో ఉన్న పప్పులను, చక్కెరను ఏరుకుంటు తిన్నాడు. ఇది చూసిన ప్రతీ ప్రేక్షకుడికి 'ఆకలి రాజ్యం' సినిమానే గుర్తొస్తుంది. అంతలా ఆకలికి విలవిలలాడారు అని స్పష్టంగా తెలుస్తోంది.
అయితే తర్వాత ఆడిన టాస్క్ లలో రెండు టీం లు గెలిచి అందరికి ఫుడ్ లభించడంతో కాసేపటికి అందరు మళ్ళీ మాములుగా అయ్యారు. లేదంటే ఆకలికి పడిపోయేవాళ్ళు అన్నట్టుగా అనిపించింది చూసిన ప్రతీ ఒక్కరికి. ఆకలితో కంటెస్టెంట్స్ చేసిన ప్రతీది ఎంటర్టైన్మెంట్ ని సృష్టించిందనే చెప్పాలి. ఈ ఆకలి బాధను చవిచూసాక, ఇకముందు కంటెస్టెంట్స్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారనే ఆశిస్తున్నారు ప్రేక్షకులు.
![]() |
![]() |